కిడ్నాప్‌కు గురైన అమ్మాయిని వెతకాలంటే పోలీస్‌ బండ్లకు డీజిల్‌ కొట్టించాలంటా..

-

తన కుమార్తె కిడ్నాప్‌కు గురవడంతో ఆ తల్లి పోలీస్‌ స్టేష్‌కు వెళ్లితే వారి తీరుతో విసుగెత్తి ఉన్నతాధికారులతో మొర పెట్టుకుంది. కిడ్నాప్‌కు గురైన కూతురిని వెతకాలంటే పోలీసులు తమ వాహనాల్లో డీజిల్‌ పోయించాలని డిమాండ్‌ చేస్తున్నారని మీడియా ముందు బోరున విలపించిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌ జిల్లాకు చెందిన ఓ దివ్యాంగురాలైన ఆమె కుమార్తె కిడ్నాప్‌కు గురవడంతో పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది.

నీ కూతరుని వెతకాలంటే మా వాహనాలలో డీజిల్‌ పోయించాలని డిమాండ్‌ చేయడంతో అప్పుసొప్పు చేసి రూ. 15 వేల డీజిల్‌ కొట్టించాను. నా కూతురి గురించి ఆరా తీశారా అని అడిగితే వెతుకుతున్నాం.. ఎప్పుడంటే అప్పుడు పోలీస్‌ స్టేషన్‌కు రావొద్దు.. ఒక్కోసారి బయటకు కూడా నెట్టేస్తున్నారని ఆ దివ్యాంగురాలు కమిషనర్‌ కార్యాలయం వద్ద మీడియాతో తన ఆవేదన చెప్పుకుంది.

నిందలు వేస్తున్నారు..

తమ బంధువే కుమార్తెను కిడ్నాప్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొనగా, నీ కూతురు మంచిది కాదని నిందలు వేస్తున్నాని సదరు మహిళ పేర్కొంది. ఈ స్టేషన్‌లో ఒక్కరు మాత్రమే తనకు సహకరిస్తున్నారని మిగతా సిబ్బంది అంతా డబ్బులు డిమాండ్‌ చేస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించింది.
ఈ విషయమై కాన్పూర్‌ సీనియర్‌ పోలీస్‌ అధికారైన బ్రజేష్‌ కుమార్‌ శ్రీవాస్తవ స్పందించి మాట్లాడారు. దివ్యాంగురాలైన ఆ మహిళ కేసుపై తక్షణమే స్పందించాలని ఆ స్టేషన్‌ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆమె చెబుతున్న విషయాలు నిజమైతే∙బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news