బెంగళూరులో చంపి నెల్లూరులోనే ఎందుకు పూడ్చారు..?

-

కర్ణాటక రాజధాని బెంగళూరులో దుండగలు చేతిలో హత్యకు గురైన సిద్ధార్థను, రాపూరు–గుండవోలు అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టినట్లు సమాచారం. దీంతో నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. జనవరి 19న సిద్ధార్థ కనిపించడం లేదని బెంగళూరులోని అమృతహళ్లి పోలీస్‌ స్టేషన్లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అయితే.. సిద్ధార్థ కర్నాటక ఓ మాజీ సీఎం బంధువు కూడా. సిద్ధార్థ కాల్‌ డేటా ఆధారంగా పోలీసులు విచారణ జరిపగా పలువురు అనుమానితులను పట్టుకొని విచారించగా కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

కిడ్నాప్‌ చేసి హత్య..

కొందరు వ్యక్తులు సిద్ధార్థను అపహరించి హత్య చేశారని నిర్ధారించారు.నిందితుల్లో ఒకరైన వినోద్‌ అనే వ్యక్తిని రిమాండ్‌కు తరలించారు. అయితే సిద్ధార్థను కిడ్నాప్‌ చేసిన తరువాత అతని మృతదేహాన్ని నెల్లూరు జిల్లా రాపూరు–పెంచలకోన సమీపంలోని గు౦డవల్లి అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టినట్లు పోలీసుల విచారణలో వినోద్‌ చెప్పినట్లు సమాచారం. ఈ రోజు కోర్టు అనుమతితో వినోద్‌ను ఆ ప్రాంతానికి తీసుకు రానున్నట్లు తెలిసింది. ఇప్పటికే çకర్నాటక పోలీసు బృందాలు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు.

ఆస్తి పంపకాలేనా..?

అయితే బెంగుళూరులో హత్య చేసిన వ్యక్తిని నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చి పూడ్చి పెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానిపై కూడా పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. పోలీసులు, వైద్యుల సమక్షంలో సిద్థార్థ మృతదేహాన్ని బయటకు తీయనున్నారు. ఆస్తుల పంపకాలు, ఆర్థిక లావాదేవీలు ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news