వాట్సప్‌లో 7 కొత్త ఫీచర్స్‌!

-

కోట్లాదిమంది రోజూ ఉపయోగిస్తున్న ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ యాప్‌. యూజర్లకు కొత్తకొత్త ఫీచర్స్‌ అందించేందుకు నిత్యం పనిచేస్తోంది వాట్సప్‌. అందుకే దీన్ని కోట్లాది మంది వాడుతున్నారు. ఇప్పటి వరకు వందలాది కొత్త ఫీచర్స్‌ని వినియోగదారులకు అందించింది. అదే బాటలో మరిన్ని కొత్త ఫీచర్స్‌ని పరీక్షిస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్స్‌ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. వాట్సప్‌ ఏ ఫీచర్‌ రూపొందించినా ముందుగా బీటా యూజర్లు టెస్ట్‌ చేస్తారు. విజయవంతంగా పరీక్షించిన తర్వాత ఆ ఫీచర్లను ఇతర యూజర్లకు అందిస్తుంది వాట్సప్‌. ఏవైన మార్పులు ఉంటే సరిచేసే ప్రణాళికలో ఉంది. మరి త్వరలో వాట్సప్‌ నుంచి రాబోయే ఫీచర్స్‌ ఏంటో తెలుసుకుందాం.

 

  • ప్రస్తుతం వాట్సప్‌ను కంప్యూటర్‌లో లాగిన్‌ కావాలంటే దగ్గర ఫోన్‌ ఉండాలి. ఫోన్‌ తో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తేనే లాగిన్‌ చేయడం సాధ్యం అవుతుంది. ఇకపై ఫోన్‌ అవసరం లేకుండా వాట్సప్‌లో లాగిన్‌ కావొచ్చు.
  • ఒకే వాట్సప్‌ అకౌంట్‌ను స్మార్ట్‌ఫోన్‌ లో, కంప్యూటర్‌లో, ట్యాబ్లెట్‌లో లాగిన్‌ కావొచ్చు. ఏ డివైజ్‌ నుంచి మెసేజెస్, ఫైల్స్‌ పంపినా, అన్ని డివైజ్‌లల్లో సింక్‌ అవుతుంది. అదే వాట్సప్‌ మల్టీ డివైస్‌ ఫీచర్‌.
  • వాట్సప్‌లోని మెసేజెస్‌ని ఆటోమెటిక్‌గా డిలిట్‌ చేసేందుకు ఈ వాట్సప్‌ డిసపీయరింగ్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ ద్వారా వారం రోజుల క్రితం మెసేజెస్‌ని ఆటోమెటిక్‌గా డిలిట్‌ చేయవచ్చు.
  • వాట్సప్‌లో ఏదైనా వీడియో షేర్‌ చేసేప్పుడు ఆడియో మ్యూట్‌ చేసి పంపొచ్చు. అవతలివారికి వీడియో కనిపిస్తుంది తప్ప ఆడియో వినిపించదు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా యూజర్లు టెస్ట్‌ చేస్తున్నారు.
  • వాట్సప్‌ రీడ్‌ లేటర్‌ ఫీచర్‌ తీసుకురానుంది. ఈ ఫీచర్‌ యాక్టివేట్‌ చేస్తే మీకు వచ్చే మెసేజెస్‌ మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు చదువుకోవచ్చు. అంటే ఆర్కైవ్డ్‌ ఛాట్స్‌ లాగా పనిచేస్తుంది.
  • వాట్సప్‌ సెల్ఫ్‌ డిస్‌స్ట్రక్టింగ్‌ ఫోటోస్‌ ఫీచర్‌ని టెస్ట్‌ చేస్తోంది. ఈ ఫీచర్‌ని బీటా యూజర్లు పరీక్షిస్తున్నారు. మెసేజ్‌ మాయమైనట్టు ఫోటోలు కూడా మాయమైపోతాయి. అంటే ఫోటోలు ఆటోమెటిక్‌గా డిలిట్‌ అవుతాయి.
  • వాట్సప్‌లో ఫోటోలు, వీడియోలు షేర్‌ చేయడానికి ఉపయోగపడే సెక్షన్‌ ను రీడిజైన్‌ చేస్తోంది. వాట్సప్‌ మీడియా సెక్షన్‌ అప్‌డేట్‌లో వాట్సప్‌లోనే వీడియో ఎడిట్‌ చేయొచ్చు. అంటే వేరే యాప్‌ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా వాట్సప్‌లోనే వీడియో ఎడిట్‌ చేసి స్టేటస్‌లో షేర్‌ చేయొచ్చు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news