కేంద్రంతో ప్రతి దాంట్లో ఘర్షణ పడమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన ఆయన కేంద్రంతో రాజ్యాంగ పరమైన సంబంధాలు కొనసాగిస్తామని అన్నారు. అవసరమైన చోట ఘర్షణ పడతాం…హక్కుల కోసం పోరాడతామని అన్నారు. ప్రతి దానికి పేచీ పెట్టుకుని బస్తీమే సవాల్ అంటే జరుగదని కేంద్రంతో రాజ్యాంగ పరమైన స్నేహాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతాం అదే సమయంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీపడం అని అన్నారు.
వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్న ఆయన వ్యవసాయ చట్టలతో లాభం జరుగుతుందన్న బలమైన విశ్వాసంతో మోదీ ఉన్నారని రైతులు ఏమో దీక్షలు చేస్తున్నారని అన్నారు. ఒక విచిత్రమైన అనిశ్చితి ఉంది…రాబోయే రోజుల్లో ఏం జరుగుతోందో తెలియదని అన్నారు. నచ్చినా నచ్చకున్నా పార్లమెంట్ చేసిన చట్టాలు అమలు చేయాల్సిందేనని కేసీఆర్ తేల్చి చెప్పారు. వ్యవసాయ మార్కెట్ లను రాష్ట్రంలో కొనసాగిస్తామని అన్నారు.