రేపు కల్కి మూవీ నుంచి అప్డేట్

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐనా క్షణాల్లో వైరల్ అవుతోంది.ఇక ఈ సినిమా నుంచి రేపు ఉదయం 10 గంటలకు అప్డేట్ రానున్నట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. దీంతో ట్రైలర్ గురించే కావొచ్చని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news