గత ఐదేళ్లు ఏపీలో సాగించిన అరాచక పాలనతో వైసిపి మూల్యం చెల్లించుకుంది. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ కనీవిని ఎరగని రీతిలో ఓటమి పాలయింది.వైఎస్ జగన్ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు.కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.
ఇదిలా ఉంటే… అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ 8 ఉమ్మడి జిల్లాల్లో ఖాతానే తెరవలేదు. శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులెవరూ గెలవలేదు. ఆయా జిల్లాలను కూటమి పార్టీలు ఊడ్చిపారేశాయి.