యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు ఆలియాభట్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరీస్ నటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో హీరోలు హీరోయిన్లు ఇతర సినిమా షూటింగ్లో బిజీ అవుతున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే చిత్ర యూనిట్ పలు అప్డేట్స్ తో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఇక రామ్ చరణ్ కు సంబంధించిన వీడియో మరియు ఎన్టీఆర్ కు సంబంధించిన వీడియోలను విడుదల చేయగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా తాజాగా చిత్ర యూనిట్ మరో అప్డేట్ ప్రకటించింది. రేపు ఉదయం 11 గంటలకు సినిమా నుండి గ్లింప్స్ ను విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేసింది. దాంతో చిత్ర యూనిట్ ఎలాంటి అప్ డేట్ ఇస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి జక్కన్న ఎలాంటి అప్ డేట్ ఇస్తారో చూడాలి.