భీమ్లా నాయక్ నుండి మరో అప్డేట్ వచ్చేసింది..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్ల నాయక్ సినిమా నుండి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి “అంతాఇష్టం” అనే పాటను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. భీమ్లా నాయక్ కు మరోవైపు అంటూ ఈ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా పవన్ తో నిత్యామీనన్ కూర్చుని ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. సినిమాలో పవన్ కు భార్యగా నిత్యమీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో చిత్రం నుండి మొదటి సారి పవన్ నిత్యామీనన్ ల పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఇక పోస్టర్ లో పవన్ ఓ రయిపై కూర్చుని ఉండగా నిత్యా మీనన్ పక్కన గద్దె పై కూర్చుని ఉంది. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే అంతా ఇష్టం అనే పాట రొమాంటిక్ నేపథ్యంలో ఉండబోతున్నట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news