క్రికెట్ లోకి ఉసెన్ బోల్డ్..RCB తరఫున బరిలోకి !

-

న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్ లో అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఇందులో ప్రపంచ దేశాల నుంచి 8 జట్లు పాల్గొనబోతున్నాయి. మొదటి ఎడిషన్ ఇండియాలో జరగబోతుంటే ఆ తర్వాత మిడిల్ ఈస్ట్, యూఎస్ఏ, కెనడా, సౌత్ ఆఫ్రికా దేశాల్లో గ్లోబల్ పవర్ క్రికెట్ లీగ్ ని నిర్వహించాలని భావిస్తున్నారు నిర్వాహకులు, ఇప్పటికే ఈ 8 టీమ్స్ కి పేర్లు కూడా పెట్టేశారు.

ఇండియన్ సప్పైర్స్, ఆస్ట్రేలియా గోల్డ్స్, ఇంగ్లీష్ రెడ్స్, అమెరికన్ ఇండిగోస్, ఐరిష్ ఓలివ్స్, స్కాటిష్ మల్బేరిస్, సౌత్ఆఫ్రికా ఏమేరాల్డ్స్, శ్రీలంక వైలెట్స్ పేరుతో 8 జట్లు పోటీలో దిగబోతున్నాయి. ఉసేన్ బోల్ట్ తో పాటు మునాఫ్ పటేల్, యూసపఫ్ పఠాన్, గుల్బర్దిన్ నైబ్, ఏంజెలో మాథ్యూస్, ఇయాన్ బెల్ వంటి మాజీ క్రికెటర్లు కూడా ఈ గ్లోబల్ టీ 20 పవర్ క్రికెట్ లీగ్ లో పాల్గొనబోతున్నారు. భారత మాజీ సారథి విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన ఉసేన్ బోల్ట్, ఐపిఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరఫున ఆడేందుకు సిద్ధమని సోషల్ మీడియా వేదికగా గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news