సాధారణంగా మనం వాస్తు నియమాలు పాటించేది ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా.. సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని. దీనికోసం ఇళ్లు నిర్మించేటప్పటి నుంచే కొన్ని నియమాలతో పూర్తి చేస్తాం. అయితే, ఇంటిని శుభ్రపరచడంలో కూడా కొన్ని నియమాలను పాటిస్తే.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చోటు ఉండదు.
సాధారణంగా ఉప్పు లేని కూర రుచించదు. అయితే కేవలం కూరల్లోనే కాకుండా ఉప్పుతో కొన్ని పరిహారాలను సూచిస్తున్నారు నిపుణులు. ఈ విధంగా పాటిస్తే ఒకవేళ మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే అది వెళ్లిపోతుంది. వాస్తు శాస్త్ర ప్రకారం వంట గదిలో ఉండే ఉప్పు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీంతో చాలా ఇంకా ఇతర లాభాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు తెలుసకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ఉప్పు సుఖసంతోషాలకు ప్రతీక.
ఒక చిటికెడు ఉప్పుతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దీంతో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోవడమే కాకుండా దరిద్య్రాన్ని తరిమే గుణం ఉంటుంది. దీనికి ప్రతిరోజూ మనం ఇల్లు శుభ్రం చేసేటపుడు చిటికెడు ఉప్పు (ముఖ్యంగా సముద్రపు ఉప్పు)ను ఆ నీటిలో కలిపి తూడవాలి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ తొలగి, ఇంట్లో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. కానీ, వారంలో ఒక్కరోజు మాత్రం ఈ పరిహారాన్ని చేయకూడదు. అదే గురువారం. ఈ రోజు తప్ప వారంలో ప్రతిరోజూ ఈ పరిష్కారం చేసుకోవచ్చు.