సమస్త ప్రాణులు జీవించటానికి అవసరమైన, ముఖ్యమైన వాటిల్లో గాలి తరువాత నీరు ఒకటి. నీరు దొరకడం ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతుంది. ఈ భూమి మీద నీటి నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి.
అందుకే నీటి ని పొదుపు చేసే, ఇంకుడు గుంతలు ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయాలి. ఇళ్ళల్లో నీటిని పొదుపు గా వాడాలి. కొన్ని ప్రాంతాలలో తాగడానికి కూడా స్వచ్ఛమైన నీరు దొరకని పరిస్థితి. అందుకే సముద్రపు నీటిని శుద్ధి చేసి మంచి నీరు గా మార్చే ప్రయోగాలు జరుగుతున్నాయి.
పూర్తి ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషికి రోజుకి 5లీటర్ల నీరు అవసరం అవుతుంది. భోజన సమయంలో కొంచెం కొంచెంగా నీరు తాగి భోజనానాంతరం ఎక్కువగా తాగుతూ ఉంటే తిన్న ఆహారం వెంటనే జీర్ణమవుతుంది.
ప్రతి రోజూ ఉదయం పూట నులివెచ్చని నీటితో స్నానం చేస్తూ ఉంటే నిద్ర మత్తు, శారీరక బడలిక, అలసట తగ్గిపోయి మంచి ఉత్సాహంగా ఉంటారు.
వేడి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పుక్కిలి చేస్తే గొంతు నొప్పి తగ్గి పోవడమే కాక గొంతు పరి శుభ్రం గా ఉంటుంది.