యోగా అసలు మానకండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి…!

-

యోగా అనేది ఇప్పుడు ప్రజల జీవన విధానంలో ఒక అలవాటుగా మారిపోయింది. ఆరోగ్యం కావాలి అనుకున్న వాళ్ళు ఈ భారతీయ ఆరోగ్య విధానం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వైద్యులు కూడా యోగా చెయ్యాలని సూచించడంతో యోగా చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. యోగా ఉపయోగాలు తెలియక చాలా మంది దాన్ని పెద్దగా పట్టించుకోరు.

కాని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి యోగాతో. రోజుకు కనీసం 25 నిమిషాల పాటు యోగా అనేది చాలా అవసరం. వైద్యులు చెప్పడం కాదు మీకే తెలుస్తుంది. దానితో మెదడు పనితీరు మెరుగై, ఉల్లాసంగా ఉంటామని సర్వేలు కూడా పలు మార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. యోగా చేస్తే శరీర అవయవాలు ఉత్తేజితమవుతాయని, మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుందని అంటున్నారు వైద్యులు కూడా.

అంతే కాదు అండోయ్, కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్లూ ఒక కీలక విషయం చెప్పారు. ధ్యానంతో మెదడులోని అభిజ్ఞా విధులు మెరుగవుతాయని వారు అంటున్నారు. ముఖ్యంగా హత యోగా ప్రధానమైనదని తమ పరిశోధనల్లో గుర్తించారు. మీరు ఎంత బిజీ గా ఉన్నా సరే యోగా కోసం ప్రత్యేక సమయం కేటాయించుకుని వదలకుండా చేస్తే ఎన్నో వ్యాధులకు పరిష్కారం చూపిస్తుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news