డయాబెటిస్‌ మెడిసిన్‌ Metformin ‌లో.. క్యాన్సర్‌ కారకాలు..!

-

అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు షాకింగ్‌ విషయాన్నివెల్లడించారు. డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు షుగర్‌ లెవల్స్‌ను తగ్గించుకునేందుకు వాడే మెట్‌ఫార్మిన్ (Metformin)‌ మందులో అనుమ‌తికి మించిన స్థాయిలో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు అమెరికాతోపాటు, భారత్‌లోని పలు మెట్‌ఫార్మిన్‌ మెడిసిన్‌ను తయారు చేసే కంపెనీలకు యూఎస్‌ఎఫ్‌డీఏ అధికారులు ఆ మందులను వెనక్కి తీసుకోవాలని సూచించారు.

USFDA finds unacceptable limit of carcinogens in metformin er tablets

సాధారణంగా డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు షుగర్‌ లెవల్స్‌ను తగ్గించుకునేందుకు వాడే అనేక రకాల మందుల్లో మెట్‌ఫార్మిన్‌ కూడా ఒకటి. దీన్ని అనేక మంది డాక్టర్లు ఫ్రంట్‌ లైన్‌ ట్రీట్‌మెంట్‌ కింద పేషెంట్లకు రాస్తుంటారు. మెట్‌ఫార్మిన్‌లో ఇమ్మిడియట్‌ రిలీజ్‌, సస్టెయిన్డ్‌ రిలీజ్‌, ఎక్స్‌టెండెడ్‌ రిలీజ్‌ అని మూడు రకాల ట్యాబ్లెట్లు ఉంటాయి. ప్రస్తుతం ఎక్స్‌టెండెడ్‌ రిలీజ్‌ మెట్‌ఫార్మిన్‌ ట్యాబ్లెట్లలోనే క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు గుర్తించారు.

మెట్‌ఫార్మిన్‌ ఎక్స్‌టెండెడ్‌ రిలీజ్‌ ట్యాబ్లెట్లలో నైట్రోసమైన్‌ స్థాయిలు అధికంగా ఉన్నాయని యూఎస్‌ఎఫ్‌డీఏ గుర్తించింది. దాన్నే ఎన్‌-నైట్రోసొడైమిథైలమైన్‌ (ఎన్‌డీఎంఏ) అని కూడా పిలుస్తారు. ఇది కార్సినోజెన్‌. అంటే క్యాన్సర్‌ కారకం. దీర్ఘకాలికంగా ఈ పదార్థాన్ని మనం తీసుకుంటే మనకు క్యాన్సర్‌ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకనే యూఎస్‌ఎఫ్‌డీఏ సదరు ట్యాబ్లెట్లను వెనక్కి తీసుకోవాలని తయాదీదార్లను కోరుతోంది. ఇక దీనిపై త్వరలో మరిన్ని వివరాలు తెలుస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news