రికార్డ్స్: యు ట్యూబ్ ను షేక్ చేస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్”… ఒకటిన్నర గంటలోనే !

-

ఇటీవల డైరెక్టర్ హరీష్ శంకర్ అండ్ టీం ప్రకటించిన విధంగానే ఈ రోజు సాయంత్రం 4 .59 గంటలకు పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ను హైద్రాబాద్ లో ఒక థియేటర్ లో విడుదల చేశారు. ఈ వీడియో ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎంతలా అంటే విడుదల అయిన ఒకటిన్నర గంటలోనే 1.5 మిలియన్ వ్యూస్ తో సక్సెస్ ఫుల్ గా దూసుకువెళుతోంది. ఈ వీడియో కు మస్త్ రెస్పాన్స్ వస్తుండడంతో పవన్ కెరీర్ లో పోలీస్ గా గెట్ అప్ వేశాక రెండవ హిట్ గ్యారంటీ అంటున్నారు. ఇంతకు ముందు హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ కంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఎంత భారీ హిట్ అయిందో చూశాము.

ఆ సినిమా తర్వాత పవన్ పోలీస్ గా చేసిన రెండవ సినిమా గబ్బర్ సింగ్ 2 ప్లాప్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాలోనూ పోలీస్ గా నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హిట్ కొడతారన్న ఆశాభావాన్ని చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news