“హాట్ స్టార్” కు జియో భారీ షాక్ ఇచ్చిన సినిమా యాప్… 46 లక్షల యూజర్లు అవుట్ !

-

ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్ లు ఎక్కువగా హాట్స్టార్ ఓ టి టి యాప్ లోనే ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇండియాలో జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 16 కు గానూ ప్రసార హక్కులను హాట్ స్టార్ కాకుండా రిలయన్స్ వారి జియో సినిమా యాప్ దక్కించుకుంది. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ లు అన్నీ ఎటువంటి ప్రసార రుసుము లేకుండా ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ లను ఈ యాప్ లో చూసే అవకాశం దక్కింది. దీనితో చాలామంది క్రికెట్ ప్రేమికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ యాప్ వలన హాట్ స్టార్ ఓ టి టి యాప్ బాగా ఆదరణ దక్కినట్లు తెలుస్తోంది. జియో యాప్ ప్రభావంతో హాట్ స్టార్ నుండి దాదాపుగా 46 లక్షల మంది బయటకు వచ్చేశారు.

ఇది హాట్ స్టార్ కు చాలా నష్టాన్ని తెచ్చిపెట్టింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఐపీఎల్ ఉంది కాబట్టి జియో యాప్ కు ఈ మాత్రం మైలేజ్ ఉంది.. ఐపీఎల్ ముగిసిపోతే మళ్ళీ హాట్ స్టార్ ను సబ్ స్క్రైబ్ చేసుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news