రఘునందన్, హరీష్ రావు బంధువులు.. ఇద్దరూ అన్నదమ్ములు !

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు కష్టపడుతున్నాయి. చివరి రోజు కావడంతో అన్ని పార్టీల అగ్ర నేతలు ప్రచారంలో బిజీ అయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్ష్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘునందన్ గెలిస్తే టిఆర్ఎస్ లోకి పోతాడన్న ఆయన రఘునందన్, హరీష్ రావు బంధువులు అని అన్నారు. ఇద్దరు అన్నదమ్ములు అని ఆయన అన్నారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రాంత ప్రజలు కల్వకుంట్ల మాటలు నమ్మి అనేకసార్లు మోసపోయారని అన్నారు.

ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని ముత్యం రెడ్డి తపన అని పేర్కొన్న ఉత్తమ్ ముత్యంరెడ్డి హయాంలో రామలింగారెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి పోల్చి చూడమని అన్నారు. స్వయానా రామలింగారెడ్డి అసెంబ్లీలో నేనేమి చేయలేకపోతున్నా అన్నారని, మరి ఆయన సతీమణి తో అభివృద్ధి అయితదా అని అయన ప్రశ్నించారు. బీజేపీకి ఓటేస్తే వృధా అవుతుందన్న ఆయన ఒకే కుటుంబంలో ఐదు ఉద్యోగాలు అభావిస్తున్నారని అన్నారు. మన నిరుద్యోగులు మాత్రం గుర్తుకు రారని, ఈ దుబ్బాక దెబ్బకు కల్వకుంట్ల కుటుంబం దిగిరావాలని ఆయన కోరారు.