యోగీతో మామూలుగా ఉండదు మరి. నెట్టింట రచ్చ చేస్తున్న యోగీ మీమ్స్… పుష్ప డైలాగ్స్ తో హంగామా

-

యోగీ ఆదిత్యనాథ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో భారీ విజయంతో బీజేపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగారు. యూపీలో 403 స్థానాలకు గానూ 270కి పైగా స్థానాలు గెలుచుకుంది బీజేపీ. మరోవైపు యోగీ విజయాన్ని కీర్తిస్తూ పలువురు తెగ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. బుల్డోజర్ ఈస్ బ్యాక్ అంటూ… తెగ సందడి చేస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ సైకిల్ గుర్తుపై ఫన్నీ ట్రోల్స్ చేస్తున్నారు. బుల్డోజర్ కింద సైకిల్ పడేసే సినిమా క్లిప్పింగ్స్ ను షేర్ చేస్తున్నారు. 

ఇక దేశవ్యాప్తంగా చాలా ఫేమస్ అయిన పుష్ప సినిమా డైలాగ్స్ తో రచ్చ చేస్తున్నారు. ‘ తగ్గేదే లేదు’, ‘‘కమలం అంటే పువ్వు అనుకున్నారా… ఫైర్’’ అంటూ అల్లు అర్జున్ ఫోటోను మార్ఫింగ్ చేసి యోగీ ఆదిత్య నాథ్ ఫోటోలను పెడుతున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు సమాజ్ వాదీ పార్టీపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇక ప్రధాని మోదీ, సీఎం యోగీ జోడీతో ‘నాటు నాటు‘ సాంగ్ తో హంగామా చేస్తున్నారు నెటిజెన్లు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news