విడుదలకు ముందు శశికళకు భారీ షాక్ ఇచ్చిన ఐటీ

-

జైలు నుంచి విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఐటీ శాఖ తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు భారీ షాక్ ఇచ్చింది. ఆమెకు సంబందించిన 2వేల కోట్ల ఆస్తులను ఫ్రీజ్ చేసింది. బినామీ ఆస్తుల నిరోధక చట్టం కింద శశికళ, ఆమె వదిన ఇళవరసి, అక్క కుమారుడు సుధాకర్‌ ఆస్తులను స్తంభింపజేస్తూ ఐటీ ఆమెకు షాకిచ్చింది. శశికళకు చెందిన రూ.300 కోట్ల విలువైన స్థలంతో పాటు సిరుదావూర్‌ బంగ్లా, కొడనాడు ఎస్టేట్‌, పోయెస్‌ గార్డెన్‌లో కొత్తగా నిర్మిస్తున్న బంగ్లా వంటి ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.

ఇప్పటికే వీకే శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్‌కు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో బెంగళూరు అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సందర్భంలో శశికళ కోట్లాది రూపాయల విలువ చేసే 500,1000నోట్లను మార్పిడి చేసుకునేలా ఈ స్థిరాస్తులు కొనుగోలు చేశారని ఐటీ గుర్తిచింది. ఐటీ శాఖ ఫ్రీజ్‌ చేసిన ఆస్తులకు ఆదాయ పన్ను శాఖకు చెందిన బినామీ నిరోధక విభాగం అధికారులు నిన్న నోటీసులు అతికించారు. మరో మూడు నెలల్లో జైలు జీవితం పూర్తి చేసుకుని విడుదల కాబోతున్న సమయంలో రాజకీయంగా తమకు ఎక్కడ అడ్డు వస్తుందోనని తమిళనాడు అధికార పార్టీ ఈ పని చేయించినట్టు ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news