కరోనాతో సహజీవనం చేస్తున్న ప్రస్తుత సమయంలో కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాని ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించనున్నారు. ఈ నెలలో పండగ పర్వదినాలు ఎక్కువగా ఉన్నందున ఎక్కువ మంది గుంపుగా చేరడం మొదలగు సమస్యలు తెలెత్తుతాయి. అందువల్ల ముందు జాగ్రత్తగా కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. వ్యాక్సిన్ ఇంకా రాలేనందున కరోనా నుండి కాపాడుకోవడానికి మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం మొదలగు విషయాలని ప్రజల్లోకి తీసెకెళ్ళనున్నారు.
ఈ మేరకు ఈ ప్రచార కార్యక్రమంలో సినిమా సెలెబ్రిటీలు, క్రీడాకారులు పాల్గొననున్నారు. ముఖ్యంగా ఎక్కువ రద్దీగా ఉండే మార్కెట్లు, రైల్వే స్టేషన్లలో ఈ ప్రచార కార్యక్రమాలని నిర్వహించాలని చూస్తున్నారు. మొత్తానికి మెల్ల మెల్లగా సాధారణ స్థితికి వచ్చేస్తున్న ప్రజలకి కరోనాపై అవగాహన మరింతగా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.