ఏపీ మద్యం పాలసీ పనిచేస్తుంది.. ఏకంగా 25శాతం తగ్గిన అమ్మకాలు..

-

ఆంధ్రప్రదేశ్ లో మద్యం విక్రయాన్ని తగ్గించే దిశగా జగన్ ప్రభుత్వం చేస్తున్న పనులు సఫలీకృతం అయ్యాయని తెలుస్తుంది. లాక్డౌన్ టైమ్ లో మద్యంపై ఏకంగా 75శాతం పెంచి ఒక్కసారిగా అందరికీ షాకిచ్చారు. ఐతే ఈ పద్దతి బాగా పనిచేస్తుందని తాజా అధ్యయనం ప్రకారం అర్థం అవుతుంది. గత ఏడాది మద్యం అమ్మకాలు 10,282కోట్లుగా ఉంటే, ఈ ఏడాది 7706 కోట్లుగా ఉంది. ఈ లెక్కన మద్యం అమ్మకాలు ఏకంగా 25శాతానికి పైగా తగ్గాయని తెలుస్తుంది.

బీర్లలో అయితే 89శాతం వరకూ అమ్మకాలు తగ్గాయని గణాంకాఅలు చెబుతున్నాయి. మద్యం రేట్లు పెంచడంతో పాటు కోవిడ్ విజృంభణ కూడా మద్యం అమ్మకాల తగ్గుదలలో ఒక కారణమని అంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో మద్యం అమ్మకాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. అంటే మద్యం పాలసీలో ఆంధ్రప్రదేశ్ సక్సెస్ అయినట్టు లెక్క. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news