అందుకే డ్రాగన్‌ ఆ విషయం దాచిందా..?

-

కరోనా మహమ్మారి విషయంలో ప్రపంచ దేశాలన్నీ చైనాపై మండిపడ్డాయి. వైరస్‌ వ్యాప్తి విషయాన్ని ప్రారంభంలోనే చైనా దాచడంతో నేడు అన్ని దేశాలు మహమ్మారి బారిన పడాల్సి వచ్చిందని ఆరోపిస్తున్నాయి. ఇటీవల విడుదలైనా ఓ నివేదికతో అదంతా నిజమేనని రుజువైంది. కరోనా వైరస్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం సోషల్‌ మీడియాల్లో ఉండరాని చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ(సీసీపీ) ఆదేశించినట్లు సమాచారం. ఇందుకు కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారికి భారీ ఎత్తున అందజేసినట్లు న్యూయార్క్‌ టైమ్స్, ప్రోపబ్లికా మీడియా సంస్థలు ప్రచురించాయి.

లీ మరణ వార్త దాచేందుకు..

కరోనా వ్యాప్తికి సంబం«ధించిన ఎటువంటి సమాచారమైనా ట్రెండింగ్‌లో ఉండరాదని.. ఆ దేశ ప్రజలు సాహాస వీరుడిగా అభివర్ణించుకున్న డా. లీ వెన్‌లియాంగ్‌ మరణ వార్త సైతం దాచి పెట్టేందుకు యత్నించింది ఈ డ్రాగన్‌. ఆ వైరస్‌ను మొట్టమొదటిగా గుర్తించింది కూడా ఆయనే. కరోనా సంబంధించిన సమాచారాన్ని సోషల్‌ మీడియా, తన మిత్రబృందంతో పంచుకుంటుండగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో అప్రమత్తమైన చైనా డా.లీ వెన్‌లియాంగ్‌ను అరెస్టు చేసి నానా ఇబ్బందులకు గురి చేసింది. అతడు ప్రజలను వ్యాధుల పేర్లతో భయాందోళనకు గురి చేస్తున్నాడని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎట్టకేలకు ఆయన చెప్పిందే జరగడంతో డ్రాగన్‌ తోక ముడిచింది. లీ కనుగొన్న వైరస్‌ ఆయనను బలి తీసుకుంది. దీంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, నిరసనలు జరిగాయి.

ముందస్తు జాగ్రత్తగా..

వివిధ దేశాల నుంచి అందిన సాయంపై కూడా ఎలాంటి సమాచారం బయటకు పొక్కరాదని.. దీంతో వేరే దేశాల నుంచి వచ్చే మందులు, వైద్యసేవలపై ఎలాంటి ప్రభావం ఉండని భావించింది. చైనవాసులు నిత్యం ఎలాంటి సమాచారం చేస్తున్నారో.. ఆ తర్వాత వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానికి ప్రతీ ప్రభుత్వం కార్యాలయాలు, పెద్ద పెద్ద టవర్లలో పలు రకాల సాఫ్ట్‌వేర్లు ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news