ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వానికి చెందిన జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్-NIACL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
స్కేల్ 1 కేడర్‌లో ఆఫీసర్ (జనరలిస్ట్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దీనిలో మొత్తం 300 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వివరాలలోకి వెళితే.. మొత్తం ఖాళీలు- 300, ఎస్‌సీ- 46, ఎస్‌టీ- 22ఓబీసీ- 81,
ఈడబ్ల్యూఎస్- 30, అన్‌రిజర్వ్‌డ్- 121. ఈ పోస్టులకు 2021 సెప్టెంబర్ 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 21 చివరి తేదీ.
అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. డ్యూటీలో చేరినప్పటి నుంచి ఒక ఏడాది పాటు ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది. ప్రొబెషన్ పీరియడ్ సమయంలో ఆఫీసర్లు ఇన్స్యూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించే నాన్ లైఫ్ లైసెన్షియేట్ ఎగ్జామినేషన్ పాస్ కావాలి. ప్రొబెషనర్స్‌గా చేరడానికి ముందే నాలుగేళ్లు కంపెనీలో పనిచేస్తామని అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి.
కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు 55 శాతం మార్కులతో పాస్ కావాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోచ్చు. ఇంటర్వ్యూ సమయానికి 2021 సెప్టెంబర్ 30 లోగా డిగ్రీ పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ ప్రూఫ్ ఉండాలి. వయస్సు విషయానికి వస్తే.. 2021 ఏప్రిల్ 1 నాటికి కనీసం 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ. పూర్తి వివరాలని https://www.newindia.co.in/ వెబ్‌సైట్ లో చూడచ్చు.