మ‌హిళానేత‌తో బీజేపీ రాష్ట్ర‌ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అస‌భ్య‌క‌ర వీడియో చాట్..!

-

త‌మిళ‌నాడులో బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌హిళా నేత‌తో చేసిన అస‌భ్య‌క‌ర వీడియో చాట్ క‌ల‌క‌లం రేపుతోంది. బీజేపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కేవీ రాఘ‌వ‌న్ పార్టీ స‌భ్యురాలితో చేస్తున్న అస‌భ్య‌క‌ర వీడియో చాటింగ్ కు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాంతో రాష్ట్ర బీజేపీలో క‌ల‌క‌లం రేగింది. ఇప్ప‌టికే కేవీ రాఘ‌వ‌న్ త‌న ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు. మ‌హిళ‌తో కేవీ రాఘ‌వ‌న్ అస‌భ్య‌క‌ర వీడియో కాల్ మాట్లాడ‌టంపై రాష్ట్ర డీజీపీ కి కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమ‌ణి ఫిర్యాదు చేసింది.

kv raghavan
kv raghavan

అయితే వీడియో కాల్ లో ఉంది తాను కాదు అని కేవీ రాఘ‌వ‌న్ చెబుతున్నారు. తన‌పై కుట్ర జ‌రుగుతోంద‌ని అంటున్నారు. కానీ త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు బాధ్య‌త వ‌హిస్తూ త‌న ప‌దవికి రాజీనామా చేస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేత వీడియో కాలింగ్ ర‌చ్చ ర‌చ్చ రేపుతోంది. మ‌హిళ‌ల‌కు బీజేపీలో ర‌క్ష‌ణ లేదంటూ ప‌లువురు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news