చంద్ర‌బాబుకు కొత్త టెన్ష‌న్.. పార్టీలో ప‌ర‌స్ప‌ర ఫిర్యాదులు..

-

ప్ర‌స్తుతం ఏపీ రాకీయాల్లో చంద్ర‌బాబుకు గ‌డ్డు ప‌రిస్థితులు న‌డుస్తున్నాయి. ఆయ‌న ప‌రిస్థితి అత్యంత దారుణంగా త‌యారైంది. టీడీపీ చ‌రిత్ర‌లో లేనంత ఘోర ఓట‌మి నుంచి ఇంకా ఆయ‌న బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నారు. ఓ వైపు జగ‌న్ దూసుకుపోతుంటే ఆయ‌న మాత్రం ఇంకా పార్టీని విజ‌య‌వంతంగా న‌డిపించ‌లేక‌పోతున్నారు. అస‌లు పార్టీ ఉనికి ప్ర‌జ‌ల్లో క‌నుమ‌రుగ‌య్యే ప్ర‌మాదంలో ప‌డింది. ఇలాంటి స‌మ‌యంలో పూర్వ వైభ‌వం తీసుకురావాలంటే క‌చ్చితంగా అధికారంలో ఉన్న వారు లేని వారు కూడా క‌లిసిక‌ట్టుగా పోరాడాలి.

త‌మ మ‌ధ్య ఉన్న‌టువంటి విభేదాల‌ను ప‌క్క‌న పెడితేనే పార్టీని స‌క్సెస్ ఫుల్ గా న‌డిపించ‌గ‌ల‌రు. కానీ ఇవేవీ ప‌ట్టించుకోకుండా ఆ మేర‌కు ఒక్క‌రు కూడా న‌డుం బిగించ‌ట్లేదు స‌రిక‌దా వారు చేసే ప‌నులు చంద్ర‌బాబుకు కొత్త చిక్కులు తెస్తున్నాయి. పార్టీలో పోరాట ప‌ఠిమ చూపించాల్సిన వారంతా కూడా ఇప్పుడు పార్టీలో కుమ్ములాట‌ల‌కు తెర‌లేపుతున్నారు. ముఖ్య‌నేత‌లంతా కూడా రెండు వ‌ర్గాలుగా విడిపోయి ప‌ర‌స్ప‌ర ఫిర్యాదులు చేసుకుంటున్నారు.

రీసెంట్ గా ఓ జిల్లాకు చెందిన కీల‌క నేత ప్ర‌స్తుతం ఆయ‌న ఎమ్మెల్యేగా ఉంటూ ఓ సీనియ‌ర్‌నేత‌ను ప‌ట్టుకుని న‌న్ను నువ్వు అధికారంలో ఉన్న‌ప్పున‌డు తొక్కేసావ్ ఎద‌గ‌నీయ‌లేదు, అలాంటిది ఇప్పుడు నువ్వు నాకు నీతులు చెప్తావా అంటూ బ‌హిరంగంగానే విమ‌ర్శించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇలాంటి వారితో చంద్ర‌బాబుకు పెద్ద త‌ల‌నొప్పులే వ‌స్తున్నాయి. ఎందుకంటే పార్టీలోఉన్న వారంతా కూడా క‌లిసిక‌ట్టుగా పోరాడితేనే అధికారం ద‌క్కుతుంది. లేదంటే క‌నీసం పోటీ కూడా ఇవ్వ‌లేక క‌నుమ‌రుగ‌వుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news