నేటి నుండి 18 ఏళ్లు దాటిన వాళ్లకి వ్యాక్సిన్..!

-

కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో సమస్యలు వచ్చాయి. వ్యాక్సిన్ ని కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. అయితే ఇప్పటి దాకా పెద్దలకి మాత్రమే వ్యాక్సిన్ ని వేశారు. కానీ ఇప్పుడు భారతదేశంలో 18 ఏళ్లు దాటిన వాళ్లకి నేటి నుండి వాక్సినేషన్ డ్రైవ్ మొదలవుతోంది.

ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు:

18 ఏళ్లు దాటిన వాళ్లకి ఫ్రీ వ్యాక్సిన్ ని ప్రభుత్వం అందించనుంది.
ఇప్పటికే చాలా రాష్ట్రాలలో అందరికీ వ్యాక్సిన్స్ వేయడం మొదలు పెట్టేశారు.
అన్ని వాక్సినేషన్ సెంటర్లో అంటే ప్రభుత్వ సెంటర్లలో మరియు ప్రైవేట్ సెంటర్లలో కూడా ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీస్ ని కల్పించారు.
ముందుగానే ఆరోగ్య సేతు యాప్ లేదా కోవిడ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యాక్సినేషన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి కామన్ సర్వీస్ సెంటర్స్ మరియు కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు.
కేంద్రం 75% వ్యాక్సిన్ ప్రొడక్షన్ ని కొనుగోలు చేసి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్ కి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news