తెలంగాణలో కొవిడ్ ప్రభావంతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.అయితే ఈ నిర్ణయమే ఇప్పుడు ఓ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేకు తీవ్ర విమర్శలు తీసుకొస్తోంది. అదేంటంటారా? అదేనండి మొన్న అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఈ మెడికల్ కాలేజీల లిస్టులో రామగుండం లేదు.
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.. తాను ఆల్ ఇండియా బ్లాక్ ఫార్వర్డ్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఓ మేనిఫెస్టో విడుదల చేశారు. అందులో మెడికల్ కాలేజీ ఏర్పాటు కూడా ఉంది. కానీ ఇప్పుడు కేసీఆర్ చెప్పిన లిస్టులో రామగుండం లేదు.
దీంతో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన సోమారపు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటులో ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యారంటూ మండిపడుతున్నారు. అలాగే రామగుండం ప్రజలు కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. ఇక సొంత పార్టీ నేతలు కూడా ఎమ్మెల్యేపై పెదవి విరుస్తున్నారు. రామగుండంకు రావాల్సిన మెడికల్ కాలేజీ జగిత్యాలకు వెళ్లడంపై రామగుండం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.