వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్: మహిళల్లో 5 రకాల ద్రుష్ప్రభావాలు..!

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత.. కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ బయట పడుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో 5 రకాల ద్రుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. వీటిలో జ్వరం, నొప్పి, వాంతులు, వికారం, రుతుచక్రంలో మార్పు వంటి సమస్యలు తలెత్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో జామా నిర్వహించిన ఓ సర్వేలో పలు విషయాలను వెల్లడించారు. పురుషుల కంటే స్త్రీలల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని, ఈస్ట్రోజన్ స్థాయి కూడా దీనికి కారణమని వైద్యులు తెలిపారు.

periods-pain
periods-pain

కడుపులో తిప్పినట్లు అవ్వడం..

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మహిళల్లో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించికపోయినా.. పలు సర్వేలో నిర్ధారణ అయింది. టీకా వేసుకున్న తర్వాత రక్తంలోని ప్లేట్‌లెట్స్ గడ్డకట్టడం, రక్తస్రావం, కడుపులో తిప్పినట్లు అవ్వడం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

రుతుచక్రంలో మార్పు..

టీకా వేసుకున్నప్పుడు మహిళల రుతుచక్రంలో మార్పులు ఏర్పడతాయి. రోగనిరోధక శక్తి పెంచే క్రమంలో టీకా డోస్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రుతుచక్రంలో మార్పులు వస్తాయి. నెలసరి తేదీకి వచ్చే పీరియడ్స్.. స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

రొమ్ము క్యాన్సర్..

ప్రస్తుతం వాడుతున్న వాక్సిన్లలో మహిళలకు పలు దుష్ప్రభావాలు చూపుతున్నాయి. శోషరస కణుపుల వాపు, రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎంఆర్ఎంఏ తీసుకునే మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. ఈ సమస్యల వల్ల దద్దుర్లు, వాపు కూడా ఏర్పడవచ్చు.

వికారంగా అనిపించడం..

వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కడుపులో మంట ఏర్పడుతుంది. దీంతో తలనొప్పి, వికారం వంటి సమస్యలు బయట పడతాయి. మహిళల ఇమ్యూనిటీ సామర్థ్యాన్ని బట్టి.. తేలికపాటి నుంచి విపరీతమైన వికారం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్ది సేపటి తర్వాత నార్మల్ అవుతుంది.

బాడీ పెయిన్స్, చలి..

టీకా వేసుకున్న తర్వాత చాలా మందికి జ్వరం, చలి, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. పురుషుల కంటే స్త్రీలల్లోనే ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. హర్మోన్ల అసమతుల్యత వల్ల ఈ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వాక్సిన్ వేసుకున్న తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news