Fact check: ఆవిరి పట్టడం వల్ల కరోనా వైరస్ తొలగిపోతుందా..?

-

కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడు తీవ్రంగా మారింది అనేక మంది ఈ వైరస్ బారిన పడిపోతున్నారు. రోజుకి లక్షల్లో కేసులు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియా లో కరోనా వైరస్ తగ్గించుకోవడానికి ప్రతి రోజు ఆవిరిపడితే మంచిది అన్న పోస్ట్స్ వస్తున్నాయి.

అయితే నిజంగా ప్రతి రోజు కూడా ఆవిరి పట్టడం వల్ల కరోనా వైరస్ తగ్గిపోతుందా లేదా అనేది ఈ రోజు చూద్దాం..! అయితే మెసేజ్ ప్రకారం వేడి నీళ్లు తాగడం వల్ల గొంతుకు మంచిది కానీ కరోనా వైరస్ ముక్కు దగ్గర వుండే పరనాసల్ సైనస్ దగ్గర మూడు నుంచి నాలుగు రోజులు ఉంటుంది. తాగే వేడినీళ్లు అక్కడికి వెళ్లవు.

4 నుంచి 5 రోజులు తర్వాత పరనాసల్ సైనస్ నుంచి ఊపిరితిత్తులకు చేరుతుంది. అప్పుడు మీకు బ్రీతింగ్ లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అందుకని ఆవిరి పట్టడం మంచిదే అయితే ఆవిరి పట్టడం వల్ల కరోనా వైరస్ చనిపోతుంది.

50 డిగ్రీస్ దగ్గర కరోనా వైరస్ డిసేబుల్ అయిపోతుంది. అంటే 60 డిగ్రీస్ దగ్గర వైరస్ వీక్ అయిపోయి ఇమ్యూనిటీ తిరిగి వైరస్ తో ఫైట్ చేయగలదు. 70 డిగ్రీల దగ్గర వైరస్ పూర్తిగా చనిపోతుంది. ఇది ఆవిరి పట్టడం వల్ల జరుగుతుందని అంటున్నారు.

వారంలో కనీసం 5 సార్లు ఆవిరి పడితే మంచిదని అంటున్నారు. ఇంట్లో ఉండే వాళ్ళు రోజుకు ఒకసారి, బయటకు వెళ్లి కూరగాయలు కొనేవాళ్ళు రెండుసార్లు, ఆఫీస్ కు వెళ్లే వాళ్ళు మూడుసార్లు ఆవిరి పట్టాలి అని అంటున్నారు. ఇలా చేస్తే పూర్తిగా కరోనా వైరస్ తగ్గిపోతుందని అంటున్నారు.

ఫ్యాక్ట్ చెక్:

కరోనా వైరస్ కి ట్రీట్ మెంట్ లో ఆవిరి పట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని యు ఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తున్నారు. కరోనా వైరస్ ఇంటి చిట్కాలతో తొలగిపోదని చెప్తున్నారు. ఆవిరి పట్టడం వల్ల జలుబు, దగ్గు లక్షణాలు తొలగిపోతాయని మాత్రమే చెబుతున్నారు.

అలాగే కాస్త రిలీఫ్ మాత్రమే ఉంటుంది కానీ వైరస్ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ ఏమాత్రం తగ్గదని అంటున్నారు. అలానే సైంటిస్టులు ముఖం కాలి పోవడం లాంటి ఇబ్బందులు మాత్రమే వస్తాయని అన్నారు. ఇటువంటి మెసేజ్లు అబద్ధమని ఆస్తమా లక్షణాలు ఆవిరి పట్టడం వల్ల మరింత ఎక్కువ అయ్యాయని.. ఆవిరి పట్టడం వల్ల ఇవి తగ్గవు అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news