Kondapolam Trailer: మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ న్యూ మూవీ.. కొండాపొలం ట్రైల‌ర్ రిలీజ్‌!

-

Kondapolam Trailer: ఇండస్ట్రీలో యువ హీరోల‌కు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మెగా మేనల్లుడుగా.. ఉప్పెన సినిమా ద్వారా వెండితెరకు పరిచమ‌య్యాడు హీరో వైష్ణవ తేజ్. త‌న న‌ట‌న‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించడం కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ చిత్రంలో ఒక మధ్యతరగతి యువకుడిగా వైష్ణవ్ తేజ్ నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ అనూష్య విజ‌యంతో వైష్ణవ్ తేజ్ కు సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు పొందిన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా అల్లుడు వైష్ణ‌వ్ న‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి కొండ‌పొలం అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్ర‌ముఖ నవల కొండపొలం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో హాట్ బ్యూటీ రకూల్ ప్రీతి సింగ్ గ్రామీణ ప్రాంతంలో గొర్లు కాసే అమ్మాయిగా క‌నిపించ‌నున్న‌ది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ను ఈ రోజు సాయంత్రం 3. 30 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు దర్శకుడు క్రిష్‌ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఉప్పెన వంటి సూపర్ హిట్ అందుకున్న వైష్ణ‌వ్ కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news