మాది భరోసా విమానాలు నడపండి.. తాలిబన్ల వేడుకోలు

-

బాబ్బాబు కొంచెం విమానాలను నడపండి మాది భరోసా అంటూ విదేశాలను వేడుకుంటున్నారు తాలిబన్లు. ప్రస్తుతం కేవలం పాక్, ఖతాలు దేశాలకు చెందిన విమానాలను మాత్రమే ఆప్గనిస్థాన్ కు నడుస్తున్నాయి. మిగతా దేశాలెవ్వీ కూడా విమానాలు నడపటం లేవు.  అమెరికన్ బలగాల తరలింపు సమయంలో కాబూల్ ఏయిర్పోర్ట్ పై ఉగ్రదాడులు జరిగాయి. ఆ తర్వాత కూడా ఆదేశంలో ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. అమెరికన్ బలగాలు పూర్తిగా వైదొలిగిన అనంతరం కాబూల్ ఇంటర్నేషనల్ ఏయిర్పోర్ట్ మెయింటనెన్స్ ను ఖతార్, టర్కీ దేశాలకు అప్పగించారు. అమెరికా దళాలు ఆప్గనిస్థాన్ని వదిలి వెళ్లిన తర్వాత తాలిబన్లు ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నారు. కొత్తకొత్త రూళ్లతో ప్రజలను ఇబ్బంది పడుతున్నారు.

రాక్షస పాలనను తలిపించే విధంగా శిక్షలు అమలు చేస్తామని కొత్త తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం నడపడంలో మాత్రం తాలిబాన్లు విఫలమవుతున్నారని పాశ్చాత్య దేశాలు చెబుతున్నాయి.  అయితే ఇప్పడు తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు మెజార్టీ దేశాలు సుముఖంగా లేవు. వరస దాడులు, తాలిబన్ల ఆటవిక చర్యల కారణంగా పాశ్చత్య దేశాాలు విమాన సర్వీసులను నడిపేందుకుముందుకు వస్తాయో రావో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news