వకీల్ సాబ్ ట్రైలర్: స్త్రీ వాదులు సంతృప్తి చెందినట్టేనా..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ పింక్ సినిమాని వకీల్ సాబ్ గా రీమేక్ చేస్తున్నాడని తెలిసినప్పటి నుండి అందరూ ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఎదురుచూసారు. ఐతే పోస్టర్, టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి కొందరు స్త్రీ వాదులు పింక్ సినిమాని పూర్తిగా మార్చేసారని, స్త్రీ మీద జరిగే కథకి హీరోయిజం జోడించి హీరోయిజాన్నే హైలైట్ గా చూపిస్తున్నారని, సినిమాలో ప్రధాన పాత్రదారులైన ముగ్గురు అమ్మాయిల పాత్రలకి ప్రాధాన్యం ఇవ్వట్లేదని అన్నారు. తాజాగా వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజైంది.

మరి ఈ ట్రైలర్ స్త్రీ వాదులని సంతృప్తి పరిచిందా అనేది చూస్తే, ట్రైలర్ లో పూర్తిగా అమ్మాయిల చుట్టూ తిరిగే కథలాగే అనిపించింది. ఒకానొక సంఘటనలో ముగ్గురు అమ్మాయిలు కేసులో ఇరుక్కోవడం, దాన్నుండి బయటపడేయడానికి పవన్ కళ్యాణ్ లాయర్ గా రావడం కనిపించింది. పవన్ కళ్యాణ్ పూర్తిగా కోర్టు సీన్లలోనే కనిపించారు. ట్రైలర్ ని బట్టి గమనిస్తే, ముగ్గురు అమ్మాయిల పాత్రలకి ఎక్కువ ప్రాధాన్యం ఉందని అర్థం అవుతుంది. ఈ పాత్రల్లో నివేథా థామస్, అంజలి, అనన్య నాగల్ల కనిపించారు. కాబట్టి వకీల్ సాబ్ ట్రైలర్ స్త్రీ వాదులని సంతృప్తి చేసిందనే అనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news