వకీల్ సాబ్ వచ్చేస్తోంది… అఫీషియల్ డేట్ ప్రకటించిన అమెజాన్ ప్రైం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఈనెల తొమ్మిదో తారీకున విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకని రికార్డ్ కలెక్షన్స్ సాధించింది.. అయితే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తిన కారణంగా ఈ సినిమా అధికారిక కలెక్షన్లు నిర్మాతలు ప్రకటించలేదు.. అయితే ఈ సినిమా ఎప్పుడు ఆన్లైన్ లో వస్తుందా ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న ఓటీటీ వినియోగదారులకు సినిమా యూనిట్ శుభవార్త చెప్పింది.

ఈ సినిమా ఏప్రిల్ 30వ తారీఖున అంటే మరో మూడు రోజుల్లో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన విడుదల చేసింది.. వకీల్ సాబ్ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించారు. బోని కపూర్ సమర్పించిన ఈ సినిమాను బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ రీమేక్ గా తెలుగులో తెరకెక్కించారు.