హైకోర్ట్ ముందు కేసీఆర్ సర్కార్ ఉంచిన లెక్క ఇది…!

-

రాష్ట్రంలో కరోనా పరిస్థితి నేపధ్యంలో హైకోర్ట్ సీరియస్ గా ఉంది. ఈ నేపధ్యంలో తెలంగాణా సర్కార్ పరిస్థితిపై నివేదిక సమర్పించింది. ఈనెల 1 నుంచి 25 వరకు రాష్ట్రంలో 23.55 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం తెలిపింది. ఈనెల 25 వరకు 4.39 లక్షల ఆర్ టి పీసీఆర్, 19.16లక్షల రాపిడ్ పరీక్షలు చేసామని వ్యాఖ్యానించింది. ఈ నెల 1 నుంచి 25 వరకు 341 మంది కరోనాతో మృతి చెందారని వివరించింది.

కరోనా పాజిటివ్ రేటు 3.5% ఉందని పేర్కొంది. పరీక్షలు ఇంకా పెంచేందుకు చర్యలు చేపడుతున్నాంమని వెల్లడించింది. నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్ లైన్ లో జరుగుతున్నాయని, మద్యం దుకాణాలు, బార్లు, పబ్ లు కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపింది. మద్యం దుకాణాలను ఆబ్కారీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు అని చెప్పింది. రాష్ట్రానికి 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేంద్రం కేటాయించిందని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news