పట్టణాల్లో గెలిస్తేనే.. బీజేపీకి పట్టు నిలిచేది

-

బీజేపీకి పట్టణాల్లోనే ఎక్కువగా పట్టుందనేది కాదనలేని వాస్తవం. ఇదే విషయాన్ని ఎన్నో సార్లు ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే రుజువైంది. నాలుగు సీట్ల నుంచి ఏకంగా 48సీట్లకు తన సంఖ్యను పెంచుకుంది. ఈ గెలుపుతో ఆ పార్టీకి పట్టణాల్లో ఎక్కువగా పట్టుందనే విషయం మరోసారి నిరూపితమైంది. కాకుంటే దీని తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మళ్లీ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది.

రాష్ట్రంలో మినీ పురపోరులో మళ్లీ పట్టు సాధించాలని బీజేపీ కోర్ కమిటీ గట్టి పట్టు మీదుంది. ఇందుకోసం నోటిఫికేషన్ రిలీజైన రోజు నుంచే వ్యూహాలు రచిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అయితే ఇక్కడ మరో గమ్మత్తేంటంటే.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వద్దని పదేపదే చెబుతుంటే.. టీఆర్ ఎస్, బీజేపీ మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఎన్నికలకు రెడీ అయిపోతున్నాయి. ఎందుకంటే ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉన్నట్టు సమాచారం. అందుకే కాంగ్రెస్ ఈ ఎన్నికలను పెద్ద సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది.

ఇక రెండు కార్పొరేషన్ల బాధ్యతలను ఇద్దరు అగ్ర నేతలు తీసుకున్నారు. వరంగల్ బాధ్యతను బండి సంజయ్, ఖమ్మం కార్పొరేషన్ బాధ్యతను కిషన్ రెడ్డి తీసుకున్నారు. అటు మహబూబ్ నగర్ బాధ్యతను డీకే అరుణకు అప్పగించారు. ఇక సిద్దిపేటలో గెలిపించేందుకు రఘునందన్ రావును పంపించారు. వీరితో పాటు స్టార్ క్యాంపెయినర్లను కూడా రంగంలోకి దించుతున్నారు. మొదటి నుంచి తమకు కలిసి వచ్చిన అర్బన్ రాజకీయాలను ఈ సారి కూడా వాడుకుంటున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్టు ఏంటంటే.. ఇప్పుడు జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కే మంచి పట్టుంది.

ఈ జిల్లాల్లో ఆ పార్టీ నేతలే చక్రం తిప్పుతున్నారు. కానీ బీజేపీ అవేవీ పట్టించుకోకుండా… తమ లెక్కలు తమకు ఉన్నాయని తన పని తాను చేసుకుంటోంది. మరి ఈ సారి కూడా మున్సిపల్ ఎన్నికల్లో జీహెచ్ ఎంసీ తరహా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news