ప్రార్థన.. ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ అంటూ సందీప్ కిషన్ హీరో గా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ తో కలిసి బ్రూస్లీ సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా మారిన ఈమె ఈ సినిమా హిట్ అవ్వకపోయినా రకుల్ ప్రీతిసింగ్ పేరు మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో మారుమోగింది అని చెప్పవచ్చు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ తో సరైనోడు , ú మహేష్ బాబు తో స్పైడర్ వంటి సినిమాలలో నటించి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.కేవలం సినిమాలలోనే కాకుండా పలు బిజినెస్లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ దూసుకుపోతోంది. అటు సినిమాల పరంగా ఇటు వ్యాపారపరంగా కొన్ని కోట్ల రూపాయలకు పైగా కూడబెట్టినట్లు సమాచారం. ఇక మొత్తంగా రకుల్ కూడబెట్టిన ఆస్తులు చూసుకుంటే మిగిలిన హీరోయిన్లకు కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం అని చెబుతున్నారు మిగతావారు.. రకుల్ కి హైదరాబాద్ తోపాటు ముంబై, వైజాగ్ వంటి మహానగరాలలో స్థిరాస్తులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాదులో సుమారుగా 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు కోట్లకు పైగా ఖర్చు చేసి ఒక సొంత ఫ్లాట్ కూడా ఉందట. అంతే కాదు ఖరీదైన సొంత ఇల్లు కూడా ఉన్నట్లు సమాచారం.
దాంతోపాటు హైదరాబాదులో ఈమెకు 2 జిమ్ సెంటర్ లు కూడా ఉన్నాయి. F45 పేరుతో జిమ్ బిజినెస్ ను కూడా మొదలు పెట్టి విజయం సాధించింది. ఇక హైదరాబాద్ లోని రెండు బ్రాండ్స్ లతోపాటు వైజాగ్ లో కూడా ఒక జిమ్ సెంటర్ ఉంది. ఇక మొత్తం అంతా కలిపి సుమారుగా రూ.600 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే తాజాగా హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. ఇక ఇప్పుడు మరొకసారి వైష్ణవ తేజ్ నటిస్తున్న రంగ రంగ వైభవంగా సినిమాతో కూడా మే 27న ప్రేక్షకుల పలకరించడానికి సిద్ధమైంది.