పొలిటికల్‌ హీట్‌.. వంగవీటి రాధ, నాదెండ్ల మనోహార్‌ భేటీ..

-

వంగవీటి రాధ-నాదెండ్ల మనోహర్‌ భేటీ ఏపీలో పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది. రాజ‌కీయ సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్న విజ‌య‌వాడ‌లో శుక్ర‌వారం మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ప్ర‌స్తుతం టీడీపీలో కొన‌సాగుతున్న మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాకృష్ణతో జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) అధ్య‌క్షుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ భేటీ అయ్యారు. నేరుగా వంగ‌వీటి ఇంటికి వెళ్లిన నాందెడ్ల టీడీపీ నేత‌తో భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా భేటీ అనంత‌రం నాదెండ్ల‌తో క‌లిసి త‌న నివాసం బ‌య‌ట‌కు వ‌చ్చిన రాధాకృష్ణ మీడియాతో పెద్ద‌గా మాట్లాడ‌లేదు. అదే స‌మ‌యంలో కేవ‌లం మ‌ర్యాద‌పూర్వ‌కంగానే రాధాతో భేటీ అయ్యానని నాదెండ్ల తెలిపారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న వంగ‌వీటి… ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యంలో చేరారు. త‌ద‌నంత‌రం వైసీపీలో కొంత‌కాలం పాటు కొన‌సాగిన ఆయ‌న 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి చేరిపోయారు. తాజా భేటీ నేప‌థ్యంలో జ‌న‌సేన‌లోకి రాధా చేరిపోతారా? అన్న దిశ‌గా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version