రాధా నోట ఆ మాట ఎందుకొచ్చింది..

-

ఏపీలో వంగవీటి వంగవీటి కుటుంబానికి ఉన్న ఫాలోయింగ్ గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన తండ్రి వంగవీటి రంగా హత్యానంతరం తెదేపాకు పూర్తి విరుద్దమైన పార్టీలో కొనసాగిన వంగవీటి ఫ్యామిలీ అండ్ అభిమానులు ప్రస్తుతం అదే తెదేపా కు జై కోట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా రంగా హత్యను కొంత మంది వ్యక్తులకే ఆపాదిస్తూ…నిన్న వంగవీటి రాధాకృష్ణ  తెదేపాను వెనుకేసుకురావడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేపోతున్నారు. అంతే కాదు చంద్రబాబు వంటి వారు పెద్ద మనసు చేసుకుని తనను పార్టీలోకి ఆహ్వానించారంటూ మీడియాకు వెల్లడించడంతో ఒక్కసారిగా వంగవీటి అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు రాధా నిర్ణయాన్ని తీవ్రంగ వ్యతిరేకించారు. మొన్నటి వరకు వైసీపీలో కొనసాగిన రాధా పార్టీ నుంచి బయటకొచ్చేటప్పుడు జగన్ పై ఆరోపణలు చేయాడం రాధా ఆలోచన ధోరణి మారిందనే చెప్పొచ్చు. ఏపీలో జనసేన – వైసీపీలు అధికారంలోకి రావాలంటే కాపు సామాజిక వర్గం ఓట్లు కీలకం. అయితే 2014లో అదే వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ సపోర్ట్ తో అధికారంలోకి వచ్చి తెదేపా మరోసారి పవన్ తో దోస్తికి ప్రయత్నించగా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

దీంతో చేసేదేమి లేక ఎప్పటినుంచో వ్యూహాత్మకంగానే చంద్రబాబు నాయుడు వంగవీటి అనే అస్త్రాన్ని ఇప్పుడు ఆ రెండు పార్టీల మీదకు వదిలి మరోసారి విజయం సాధించాలనుకుంటున్నారు. అయితే ఈ సారి విజయం అంత సులువు కాదు… మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోనూ సీమాంధ్రులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేసి తెరాసకు బ్రహ్మరథం పట్టారు. దీనికి తోడు ఇప్పుడు జగన్ – కేసీఆర్ జాతీయ స్థాయిలో ఏర్పాటు కానున్న కూటమి విజయానికి ఒక్కటవుతున్నారు. ఇదే గనుక జరిగితే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోక తప్పదు. ఈ పరిస్థితులన్నింటిని గమనించిన చంద్రబాబు వంగవీటి రాధాకు ఎర వేసి తాను లబ్ది పొందాలనుకుంటున్నారు.

అయితే  వంగ వీటి రాధా నోటి నుంచి వచ్చిన ‘ తన తండ్రి హత్య విషయమై మాట్లాడుతూ… కొంత మంది వ్యక్తులు చేసిన దానికి తెదేపాను విమర్శించడం తగదు’ అనే సూత్రాన్ని ఇప్పుడు అదే వారి అభిమానులు సైతం వారికి అనుకూలంగా మల్చుకుంటున్నారు… రాధా గురించి పేర్కొంటూ.. ఓ వ్యక్తి పార్టీ మారినంత మాత్రనా..నిజాలు ..అబద్దాలు అవుతాయా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తన తండ్రి హయాం నుంచి అండగా నిలిచి బెజవాడలో  ఇప్పటికీ జరుగుతున్న కుల ఆధిపత్య పోరులో దెబ్బలు తింటున్న వంగవీటి అభిమానులు..తలెత్తుకోలేపోతున్నారు. రాధా ఇప్పటికైన తన తప్పుతెలుసుకోవాలని కొందరు కోరడం గమనార్హం. పాపం రాధా పాత జ్ఙాప‌కాలు ఇంత త్వరగా మరచిపోతారను కోలేదంటూ..సామాజిక మాధ్యామాల్లోనూ తనపై సెటైర్లు విసురుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news