post office: ఏ రిస్క్ లేకుండా అదిరిపోయే రాబడి..!

-

మీరు ఏ రిస్క్ లేకుండా అదిరిపోయే రాబడిని పొందాలని అనుకుంటున్నారా…? అయితే తప్పక దీని కోసం చూడాల్సిందే..! పోస్టాఫీస్‌ లో పలు రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా మీరు ఆకర్షణీయ రాబడిని ఎంతో ఈజీగా పొందొచ్చు. మరి ఆ స్కీమ్స్ గురించి…. వాటి వివరాల గురించి ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెడితే లక్షల్లో లాభం ఉంటుంది. మీరు 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది.

ఇక పోస్టాఫీస్‌ లో అందిస్తున్న స్కీమ్స్ వివరాలని చూస్తే… పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF, రికరింగ్ డిపాజిట్ RD, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ NSC, టైమ్ డిపాజిట్ TD వంటి వాటిల్లో డబ్బులు పెడితే మంచి లాభం వస్తుంది. మీరు కనుక పీపీఎఫ్‌ లో డబ్బులు పెడితే 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. అలానే టైమ్ డిపాజిట్ చేస్తే 6.7 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఇక రికరింగ్ డిపాజిట్ ‌లో కనుక డబ్బులు పెడితే 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. అదే ఎన్ఎస్‌సీ స్కీమ్‌ లో కనుక మీరు చేరితే 6.8 శాతం వడ్డీ వస్తుంది.

ఇది ఇలా ఉండగా మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, సుకన్య స్కీమ్ వంటివి కూడా ఉన్నాయి. అయితే మీరు పీపీఎఫ్ అకౌంట్ ‌లో నెలకు రూ.1,000 డిపాజిట్ చేస్తూ ఉంటె మెచ్యూరిటీ తర్వాత రూ.3 లక్షల వరకు వస్తాయి. పీపీఎఫ్ మెచ్యరిటీ కాలం లో 15 ఏళ్లు. కనుక ఈ 15 ఏళ్లు కూడా ప్రతీ నెల రూ.1000 చొప్పున కట్టాలి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news