వంగా గీతకు వర్మ వార్నింగ్‌..అధికారంలో వచ్చాక మీ పని చెబుతా !

-

పిఠాపురం వైసీపి అభ్యర్థి వంగా గీతకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వార్నింగ్‌ ఇచ్చారు. కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్ లో ఉద్యోగానికి 10 లక్షల రూపాయలు చొప్పున గీత తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఉద్యోగాలు ఏ విధంగా వేస్తారని ప్రశ్నించారు.


Varma warning to Vanga Geetha

ఈఎస్ఐ హాస్పిటల్ ఉద్యోగాలలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వివరించారు. సుమారు 30 మంది దగ్గర పది నుంచి 15 లక్షల రూపాయలు ఎం.పి. వంగా గీత కలెక్ట్ చేశారన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంక్వయిరీ చేయిస్తామని హెచ్చరించారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news