కేసీఆర్ ను కాపాడటం ఎవ్వరితరం కాదు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో 2023 డిసెంబర్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 2024 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చింది. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తోంది. కొన్ని విషయాల్లో ప్రతిపక్షాలకు, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రైతు రుణమాపీ, రైతుల పంట నష్టం వంటి తదితర అంశాలపై ఒకరిపై మరికొరూ విమర్శలు చేసుకోవడం గమనార్హం.

తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ చీఫ్, సీఎంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కాపాడాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీ కేసీఆర్ ను సేవ్ చేయాలని చేస్తోందని అందుకే సీబీఐ ఎంక్వెరీ కోరుతోందన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ను కాపాడటం ఎవరితరం కాదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ సంస్థగా మారిందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆపాలని జీవన్ రెడ్డి హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news