ఎల్లుండి చంపై సోరేన్ ప్రభుత్వానికి బల పరీక్ష.. మాజీ సీఎంకి అనుమతి..!

-

జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత జార్ఖండ్ శాసనసభ పక్ష నేతగా సీనియర్ ఎమ్మెల్యే చంపై సొరెన్‌ను JMM ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో JMM ప్రభుత్వాన్ని చంపై సోరెన్‌ మొన్న ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ జార్ఖండ్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కి తీసుకొచ్చారు. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష ఉంది. ఇప్పటికే జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోబాలకు ప్రభావితం కాకూడదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో క్యాంప్ పెట్టారు.

మరోవైపు సోమవారం జరిగే చంపై ప్రభుత్వానికి బలపరీక్షకు మాజీ సీఎం  హేమంత్ సోరెన్ పాల్గొనేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చంపై సోరెన్ ప్రభుత్వానికి బల పరీక్షలో నెగ్గడం చాలా తేలిక అవ్వనుంది. మరోవైపు జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలోకి జోడో యాత్ర ప్రవేశించింది. జేఎంఎంని కాంగ్రెస్ రక్షించిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర జార్ఖండ్ కి చేరుకోవడం.. జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సోమవారం జార్ఖండ్ కి వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర 67 రోజుల్లో 6,713 కిలోమీటర్లు ప్రయాణించి, 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా మార్చి 20న ముంబైలో యాత్ర ముగియనుంది.

Read more RELATED
Recommended to you

Latest news