ప్రతి ఇంట్లో కూడా అనేక రకమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి అయితే సమస్యలు తొలగి పోవాలంటే వాస్తు ప్రకారం నడుచుకోవాలి. వాస్తు ప్రకారం మీరు అనుసరిస్తే ఏ బాధ ఉన్నా కూడా తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు. వీటిని మీరు ఫాలో అయితే ఏ బాధ ఉండదు.
ఎలాంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది. మరి పండితులు చెప్తున్న అద్భుతమైన వాస్తు చిట్కాలని ఇప్పుడే చూసేద్దాం. ముఖ్యంగా ముఖద్వారం వద్ద ఎవరు కూడా ఎటువంటి తప్పులను చేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ముఖ ద్వారం దగ్గర ఈ తప్పును చేస్తే సమస్య తప్పదు. చాలా మంది గడియారాలని ఇష్టం వచ్చిన చోట పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ముఖద్వారం దగ్గర గడియారాన్ని పెడతారు.
ముఖద్వారం మీద అంటే మెయిన్ డోర్ కి క్లాక్ ని పెట్టకూడదు. మెయిన్ డోర్ కి కనుక గడియారం తగిలిస్తే ఇబ్బందులే వస్తాయి. పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. కాబట్టి ఈ తప్పుని అసలు చేయొద్దు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కి కానీ గడియారాన్నిపెడితే మంచిది. ఇది పాజిటివ్ ఎనర్జీ ని తీసుకొస్తుంది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అలాగే దక్షిణ వైపు ఎప్పుడు గడియారం పెట్టకూడదు. ఇది కూడా నెగటివ్ ఎనర్జీ ని తీసుకువస్తుంది. దక్షిణం వైపు యముడు దిక్కు కాబట్టి ఈ తప్పులను చేయొద్దు.