ఇంట్లో వాస్తుని అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మంచి జరుగుతుందని చాలా మంది వాస్తుని అనుసరిస్తూ ఉంటారు. మీ ఇంట్లో కూడా మంచి కలగాలని పాజిటివ్ ఎనర్జీ కలగాలని అనుకుంటున్నారా..? అయితే ఇవి ముఖ్యం. సాధారణంగా మన ఇళ్లల్లో
కర్టెన్లని కడుతూ ఉంటాము. అయితే కర్టెన్లలో రంగు రంగుల కర్టెన్లు ఉంటాయి. ఏ కర్టెన్లని కడితే ఎటువంటి ప్రయోజనం పొందవచ్చు అనేది వాస్తు నిపుణులు చెప్పారు. అదే ఇప్పుడు తెలుసుకుందాం.
ఎరుపురంగు కర్టెన్:
ఎరుపురంగు కర్టెన్ ని కడితే టెన్షన్లు పెరిగిపోతాయి. అయితే ఎరుపురంగు కర్టెన్ కట్టినప్పుడు దక్షిణం వైపు ఉంటే మంచిది.
నీలం రంగు కర్టెన్:
నీలం రంగు కర్టెన్ ని కడితే గొడవలు తగ్గుతాయి. నీలం రంగు కర్టెన్ ని ఉత్తరం వైపు పెడితే మంచిది. ప్రశాంతత కూడా కలుగుతుంది. బెడ్ రూమ్ లో నీలం రంగు కర్టెన్ ని కడితే చాలా మంచిది. స్టడీ రూమ్ లో రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు.
తెల్లటి కర్టెన్:
తెలుపు రంగు కర్టెన్లను కనుక కట్టారు అంటే ఎంతో మంచి కలుగుతుంది. అదృష్టం కూడా వస్తుంది. తెలుపు శాంతికి చిహ్నం. కాబట్టి తెల్లటి కర్టెన్ ని కూడా ఇంట్లో పెడితే మంచిది.
పసుపురంగు కర్టెన్:
పసుపురంగు కర్టెన్ ని కూడా ఇంట్లో కట్టుకోవచ్చు. వాస్తు ప్రకారం చూస్తే ఈ కర్టెన్ కట్టడం వల్ల ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండవు. అందరూ ఆనందంగా ఉండడానికి అవుతుంది. ఇలా ఇళ్లల్లో ఈ విధంగా కట్టడం వల్ల ఆ చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు ఇబ్బందులు ఏమైనా ఉన్నాసరే పోతాయి.