వాస్తు: ఉదయాన్నే లేచాక వీటిని చూస్తే చాలా మంచిదట..!

-

వాస్తుని అనుసరిస్తే ఎలాంటి సమస్యలనైనా తొలగించుకోవచ్చు. వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పైగా అనారోగ్య సమస్యలు ఇంట్లో ఎవరికైనా ఉంటే కూడా వాస్తుని అనుసరించడం మంచిది. దీని వల్ల మంచి కలుగుతుంది.

వాస్తు ప్రకారం ఉదయం లేచిన తర్వాత వీటిని చూస్తే చాలా మంచిది అని వాస్తు పండితులు అంటున్నారు. వాస్తు ప్రకారం మరి ఎటువంటి వాటిని మనం లేచిన తర్వాత చూడాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఉదయం లేచిన తర్వాత వీటిని చూస్తే చాలా మంచిదట.

అద్దం:

వాస్తు ప్రకారం ఉదయం లేచిన వెంటనే అద్దంలో చూసుకుంటే చాలా మంచిది ఇది నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది కానీ మీరు అడ్డం లో చూసే ముందు ఒకసారి మీ ముఖాన్ని కడుక్కుని ఆ తర్వాత అద్దంలో చూసుకోండి ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ కలగకుండా ఉంటుంది. దేవుడి ఫోటోలు, అందమైన పిక్చర్స్ చూడచ్చు.

శుభ్రం చేయని సామాన్లను చూడకండి:

రాత్రి తినేసి అలా వదిలేసి శుభ్రపరచని సామాన్లను చూడకూడదు ఇది నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. అందుకని రాత్రి తిన్న సామాన్లను శుభ్రం చేసుకోవాలి లేకపోతే నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.

భయంకరమైన జంతువులని చూడకండి:

ఉదయం లేచిన తర్వాత భయంకరమైన జంతువులని చూడడం వలన మీకే రోజంతా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఉదయం లేచిన తర్వాత ఈ తప్పుని కూడా చేయకండి ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే మంచి కలుగుతుంది లేకపోతే సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news