వాస్తు: ఉద్యోగం లేదా ప్రొమోషన్ రావడంలేదా..? అయితే ఇలా చెయ్యండి..!

-

వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగి పోతుంటాయి. అయితే వాస్తుని అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయ్యి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అయితే చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడతారు.

ఎక్కువమంది ఎదుర్కొనే సమస్యలలో ఉద్యోగ సమస్య కూడా ఒకటి. ఉద్యోగాల కోసం చాలామంది ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనప్పటికే ఒక్కొక్కసారి ఉద్యోగం దొరకదు. అలానే ప్రమోషన్ గురించి కూడా చాలా మంది ఎక్కువగా ఎదురుచూస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లేకపోతే ఈ చిట్కాలను పాటించండి. ఇలా ఫాలో అవడం వల్ల ఖచ్చితంగా సమస్యలు కూడా తొలగిపోతాయి.

పనిచేసే టేబుల్ మీద ఆహార పదార్థాలను ఉంచకండి:

పనిచేసే టేబుల్ మీద ఆహారపదార్థాలను పెట్టడం మంచిది కాదు దీని వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. పనిలో అడ్డంకులు కూడా వస్తాయి. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ కూడా కలుగుతుంది కనుక ఎప్పుడూ ఇలా చేయొద్దు.

ముళ్ళ మొక్కలని వుంచద్దు:

పనిచేసే టేబుల్ మీద ముళ్ల మొక్కలు పెట్టడం వల్ల కూడా మంచి జరగదు దీనివల్ల నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.

పనికిరాని వాటిని ఉంచకండి:

టేబుల్ మీద పనికిరాని వాటిని అస్సలు ఉంచకూడదు దీని వల్ల కూడా నెగిటివిటీ కలుగుతుంది ఇలా మీరు ఈ తప్పులు సరి చేసుకుంటే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఉద్యోగం కోసం కానీ ప్రమోషన్ కోసం కానీ ప్రయత్నం చేయాలి. అన్ని వాటంతటవే వెతుక్కుంటూ రావు కాబట్టి కాస్త కష్టపడితే అనుకున్నది సాధించడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news