వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్యలని అయినా సరే మనం సులభంగా తొలగించుకో వచ్చు ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. వీటిని అనుసరిస్తే ఏ బాధ ఉండదు. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది వాస్తు పండితులు ప్రేమికుల కి భార్యా భర్తలకి కొన్ని తప్పులు చేయకూడదని అన్నారు.
ఈ తప్పులు అస్సలు ప్రేమికులు భార్యా భర్తలు చేయకూడదు లేకపోతే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అయితే మరి ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది ఇప్పుడు చూద్దాం వీటిని కనుక మీరు ఫాలో అయితే భార్యా భర్తల మధ్య సమస్యలు రావు. అలానే వైవాహిక జీవితం అంతా ఆనందంగా ఉండేందుకు అవుతుంది.
మంచానికి ఎదురుగా అసలు అద్దాన్ని పెట్టకూడదు మంచానికి ఎదురుగా భార్య భర్తలు అద్దాన్ని ఉంచడం వలన ఎన్నో రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా వైవాహిక జీవితంలో ఆస్తమాను ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది.
అలానే వాస్తు శాస్త్రం ప్రకారం భర్త ఎప్పుడు భార్య కుడివైపున నిద్రపోవాలి ఇది కూడా వారి మధ్య బంధాన్ని బలపరుస్తుంది కాబట్టి ఈ తప్పును కూడా చేయొద్దు.
నిద్రపోయే గదిలో మనీ ప్లాంట్ ని ఉంచడం కూడా చాలా మంచిది భార్యాభర్తల మధ్య ప్రేమ ని ఇది పెంచుతుంది.
మెటల్ బెడ్స్ వంటి వాటి మీద నిద్రపోకూడదు ఈ తప్పులు చేయకుండా ఉంటే భార్యాభర్తలు ఆనందంగా ఉండొచ్చు ఏ ఇబ్బంది ఉండదు.