బీ టౌన్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నటి తెలుగు సినిమాల్లోనూ నటించి వారి ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఈ భామ ఫిట్ నెస్ పైన ఫుల్ ఫోకస్ పెడుతుంది. తన మైమరిపించే అందంతో నెటిజన్లు, తన అభిమానులను సర్ ప్రైజ్ చేస్తుంటుంది.
బాజిఘర్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి మొదట సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు ఈ సినిమాకి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు కూడా అందుకుంది. ఇక తెలుగులో ‘సాహస వీరుడు సాగర కన్య’ సినిమాతో వెంకటేశ్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఇందులో సాగర కన్య గా తన నటనకు ప్రేక్షకులు వందకు వంద మార్కులు వేశారు.
రాజ్ కుంద్రతో వివాహం తర్వాత సినిమాలకు కొంత కాలంగా దూరంగా ఉంటూ బుల్లితెరపై సందడి చేస్తుంది ఈ వాలు కళ్ల వయ్యారి. లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేసి అందరినీ షాక్ కి గురి చేసింది శిల్పా శెట్టి.ఈ ఫొటోల్లో ఆరెంజ్ రంగు వెరైటీ డ్రెస్ ధరించి చూపులతోనే కైపెక్కిస్తోంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘ఫిట్ నెస్ బ్యూటీ,నో వర్డ్స్ టు ఎక్స్ ప్లేన్, వెరీ హాట్, అందమా అదరహో’ అని కామెంట్స్ చేస్తున్నారు.