రూ.100 కోట్ల క్లబ్‌లో వీర సింహారెడ్డి.. సంక్రాంతి విజేత వాల్తేరు వీరయ్యనే !

-

బాలయ్య వీర సింహారెడ్డి సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సినిమా విడుదలైన తొలి రోజు అంటే గురువారం రోజున రూ. 25.36 కోట్లు వచ్చాయి. గ్రాస్ 54 కోట్లకు చేరింది. బాలయ్య కెరీర్ లో ఇదే అత్యధికం. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో… అత్యధిక వసూళ్లు చేసిన 15వ సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది.

ఈ నేపథ్యంలోనే పుష్ప రికార్డును బ్రేక్ చేసింది వీర సింహారెడ్డి సినిమా. ఇక ఇవాళ మరోసారి వసూళ్ల లిస్ట్‌ ను చిత్ర బృందం ప్రకటించింది. 4 రోజుల్లో వీర సింహా రెడ్డి రూ.104 కోట్లు వసూలు చేసింది. అదే వాల్తేరు వీరయ్య సినిమా మాత్రం మూడు రోజుల్లోనే రూ.108 కోట్లు వసూలు చేసింది. ఈ లెక్కన సంక్రాంతి విన్నర్‌ గా వాల్తేరు వీరయ్య సినిమా నిలిచిందన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news