చింతమనేని ప్రభాకర్ వివాదాలకు కేరాఫ్. తెలుగు ప్రజలకు ఈ పేరు తెలియకుండా ఉండదు. ఏపీలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభాకర్ పదేళ్ల పాటు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన అరాచకాలకు అంతే లేదు. ఎవరైనా అడ్డొస్తే అంతే సొంత పార్టీ నేతల నుంచి ప్రభుత్వ అధికారులు.. చివరకు సామాన్య ప్రజలు ఎలా ఎవరైనా తనకు ఎదురు చెబితే వాళ్లకు ప్రభాకర్ మార్క్ ట్రీట్మెంట్ తప్పదు.
అలాంటి ప్రభాకర్ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి చేతిలో ఓడిపోయాడు. ఎన్నికల్లో ఓడిపోయిన అప్పటినుంచి ప్రభాకర్ జైలు జీవితం గడుపుతున్నాడు. ఈ ప్రభుత్వం పాత కేసులు కూడా పెరగడంతో వరుసగా రెండు నెలల నుంచి జైలులోనే ఉంచుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్‌పై 70 కేసులు ఉండడంతో ప్రభాకర్‌కు వరుస రిమాండ్లు తప్పడం లేదు.
ప్రస్తుతం ఆయనలాగే మరో టీడీపీ ఎమ్మెల్యే తయారు అయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. సదరు ఎమ్మెల్యే దూకుడు చూస్తుంటే మరో చింతమనేని టీడీపీలో తయారయ్యారని అంటున్నారు అదే పార్టీ నేతలు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తన దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ తరపున హ్యట్రిక్ విజయాలు సొంత చేసుకున్న ఆయన ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
ఎన్నికల్లో గెలిచిన వెంటనే వెలగపూడి ఆడు జగన్ గాడు అంటూ సీఎంపై తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు. అప్పటి నుంచి ప్రతి విషయంలోనూ ఆయన దూకుడుగానే ఉంటున్నారు. ఇక వెలగపూడిపై గత ప్రభుత్వ హయాంలో చేసిన దందాలకు లెక్కే లేదు. ఇటీవలే చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో భాగంగా వెలగపూడి అనుమతి లేకుండా ర్యాలీ చేయడం… అలాగే ఏకంగా పోలీసులనే నిలదీయడం జరిగింది.
ఈ క్రమంలో ఆయనపై వరుసగా నాలుగు ఐదు కేసులు నమోదు చేశారు పోలీసులు. వరుసగా కేసులు పెట్టడం.. తర్వాత వాటినుంచి ఆయన బయటకు వచ్చేయడం మామూలు అయిపోయాయి. మరి వెలగపూడి దూకుడుకు పార్టీ వాళ్లే బ్రేకులు వేస్తారా ? లేదా ? చింతమనేని మార్క్ ట్రీట్మెంట్‌తో ప్రభుత్వమే బ్రేక్ వేస్తుందా ? అన్నది చూడాలి.