మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్నాయి… క్షణ క్షణం ఉత్కంట రేకెత్తిస్తూ అధికార లక్ష్మి కోసం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీని నిలువరించేందుకు వచ్చిన అవకాశాన్ని యుపియేలోని ప్రధాన పార్టీలు అయిన ఎన్సీపీ, కాంగ్రెస్ ఏ విధంగా వాడుకోవాలో అర్ధం కాక తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక శివసేన విషయానికి వస్తే ఇన్నాళ్ళు మేము దగా పడ్డాం… మాకు ఇప్పుడైనా అధికారం కావాల్సిందే అందుకోసం ఎంత వరకు అయినా వెళ్తామని బిజెపిని వదిలేసింది.
ఇప్పుడు మూడు పార్టీలకు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యా బలం స్పష్టంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ మూడు పార్టీలు అధికారాన్ని ఏర్పాటు చెయ్యాలి… బిజెపిని నిలువరించాలి అంటే… వీళ్ళ ముందున్న ప్రత్యామ్నాయం వీళ్ళు ఏ విధంగా అయినా కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం… ఇప్పుడు ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన ఉండి, తర్వాత ఎన్నికలు జరిగితే ఏ ఇబ్బందులు అయినా వచ్చే అవకాశం ఉంది. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది కాబట్టి ఎన్నికల నిర్వహణ అనేది ఈ మూడు పార్టీలకు ఇబ్బందే.
కాబట్టి ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చెయ్యాలి. శివసేన అయితే ఇదే పట్టుదలతో ఉంది… దీనిని ఎన్సీపీ వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అటు కాంగ్రెస్ ని కూడా ప్రభుత్వంలో ఉండాలని శరద్ పవార్ కోరుతున్నారు. రాష్ట్రపతి పాలన ముగిసేలోపు అధికారాన్ని ఏర్పాటు చేస్తామని, రాజకీయ విభేదాలు ఉన్నాయి కాబట్టి ఆలస్యమవుతుందని ఉద్దావ్ థాకరే అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే వాస్తవాలు మాట్లాడితే ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మినహా ఏ ప్రత్యామ్నాయం లేదు. వదిలేస్తే మాత్రం బిజెపికి అవకాశం ఇచ్చినట్టే.